Breaking News

Loading..

పరివర్తన యశోదా ఫౌండేషన్ సేవా సమితికి ఆల్ పెన్షనర్స్ 25 కేజీల బియ్యం అందజేత ..

ఈరోజు భద్రాచలంలోని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో  డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు. ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి కృష్ణమూర్తి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవిఎస్ఎస్ నారాయణ. ఆధ్వర్యంలో పరివర్తన యశోదా ఫౌండేషన్ సేవా సమితి అధ్యక్షుడు కొమ్మ గిరి వెంకటేశ్వర్లుకి 25 కేజిల మంచి రకం బియ్యంను అందజేశారు. ఎన్నో చీకటి బ్రతుకులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు యశోదా ఫౌండేషన్ వారు చేస్తున్న ప్రయత్నానికి మా వంతు సహకారంగా అందించే ఈ చిరు సహాయం పేదల జీవితాలలో వెలుగులు నింపుతుందని ఆశిస్తూ  మాలాగే ప్రతి ఒక్కరూ సహకరిద్దాం-సేవ చేద్దాం-అండగా ఉందాం అని అభిప్రాయపడుతూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి యశోదా ఫౌండేషన్కు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు. కె ఎస్ ఎల్ వి ప్రసాద్. డి కృష్ణమూర్తి ఎం వి ఎస్ ఎస్ నారాయణ. నాళం సత్యనారాయణ. సిహెచ్ సుబ్బయ్య చౌదరి .ఎస్ రాజబాబు. టి శివ ప్రసాద్. ఐలయ్య. విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం. మాదిరెడ్డి రామ్మోహనరావు.చుక్కా రాంబాబు. బి రాజు. పరిటాల సుబ్బారావు. పంపన సత్యనారాయణ. తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments