Breaking News

Loading..

మనం ఎంతగా దిగజారిపోతున్నామో ఒక్కసారి ఆలోచించండి..!!

హైదరాబాద్, జనవరి 16, బిసిఎం10 న్యూస్.

గత పది సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల విలువైన భూములు, ఇతర ఆస్తులు కొంతమంది దోచుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు అందులో వాటాలు ఉన్నాయి. గత 15 ఏళ్లలో రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అందులో వాటా లభించింది. వాళ్ళ ఆస్తులు వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్ల కెళ్ళిపోయాయి. అదే దోపిడి దొంగలకు మనం అభిమానులుగా మారిపోయాం. అదే దోపిడి పార్టీలకు మనం అభిమానులుగా మారిపోయాం. వాళ్ల కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే మన పంటితో తీయాలనే అంత పిచ్చి అభిమానులుగా ఉంటున్నాం. ఒక్కసారైనా ఆలోచించారా వాళ్ళ ఆస్తులు వందల కోట్లకు వేల కోట్లకు లక్షల కోట్లకు ఎట్లా పెరిగినాయో. ఏ రాజకీయ నాయకుడు ఎన్ని ఎకరాల భూమిని కబ్జా చేశాడో. మిగతా రాజకీయ నాయకులకు తెలుసు రాజకీయ పార్టీలకు తెలుసు. ఇక ప్రాజెక్టుల పేర జరిగే బాగోతం మరీ ఘోరంగా ఉంటుంది. పదివేల కోట్లతోటి కంప్లీట్ అయ్యే ప్రాజెక్టులను లక్షల కోట్లకు పెంచి వాటాలు పంచుకుంటున్నారు. మనల్ని మాత్రం కుల మతాల కంపులో కొట్లాటలో ఉంచుతున్నారు. దొంగలకు, కరప్షన్ చేసిన రాజకీయ నాయకులకు మనం అభిమానులుగా ఉండటం అంటే మనం ఎంత దిగజారిపోతున్నామో ఆలోచించండి. ఈ రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చేయటం లేదు, వైద్యాన్ని అభివృద్ధి చేయటం లేదు. విద్యాసంస్థలు వాళ్లవే, వైద్య సంస్థలు వాళ్ళవే. వాటి ద్వారా మనల్ని దోచుక తింటున్నారు.

● ఎంత దారుణం అంటే 'డయాగ్నిక్ సెంటర్స్' ఉన్నాయి కదా.

సిటీ స్కాన్ కు పదివేలు తీసుకుంటారు. దాంట్లో ఆరువేల రూపాయలు డాక్టర్ కు కమిషన్ పోతది. ఈ గాడిద కొడుకులకు తెలియదా..?? ఆ కరప్షన్ ఎందుకు ఆపలేకపోతున్నారు. వైద్యశాఖ కుంభకర్ణుడి నిద్ర పోతుందా..?? ఎందుకు డయాగ్నొస్టిక్ సెంటర్స్ మీద వీళ్ళు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇక కార్పొరేట్ ఆసుపత్రులకు పోతే చాలు కతం మన ఇల్లు గుల్ల అవుతుంది. ఉన్నది అమ్ముకోవాలి ఎంత దారుణం. పాలకులు కమిషన్లు తీసుకొని వాళ్ళు దోచుకున్నంత దోచుకుని ఇస్తున్నారు.

● ఇక విద్యాసంస్థల సంగతి తెలుసు కదా.

ఎల్కేజికి లక్ష రూపాయలు కట్టాలి, డిగ్రీ పీజీ పూర్తయ్యేసరికి కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. విద్యాసంస్థలు ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయో ప్రతి కుటుంబానికి అనుభవమే. కానీ విద్యాశాఖ వాటి పైన చర్య తీసుకోదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు అందుతున్నాయి. ఇట్లాంటి దోపిడి దొంగలకు, దోపిడి పార్టీలకు మనం అభిమానులుగా ఉంటూ, వాళ్లకోసం కొట్లాడుకుంటూ, తన్నులు తినుకుంటూ, కాళ్లు చేతులు విరగకొట్టుకుంటూ, ప్రాణాలు పోగొట్టుకుంటూ, వాళ్ళ గెలుపు కోసము అహర్నిశలు కష్టపడుతూ, వాళ్ళని గెలిపిస్తున్నాం.


వాడెవడో దిక్కుమాలిన ఎమ్మెల్యే కోసమో, మాజీ మంత్రుల కోసం, ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేల కోసం మనం పోట్లాడుతూ, మాట్లాడతా ఉంటాం. కానీ ప్రజలందరికి ఉపయోగపడే విద్య కోసం, వైద్యం కోసం, కొట్లాడటం లేదు అడగటం లేదు. చిన్న చిన్న ఉచిత పథకాలకు కక్కుర్తి పడి ఓట్లు వేసి వాళ్ళని గెలిపించి. వాళ్ళని ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రులను చేసి లక్షల కోట్లు దోచుకోండని మనం అధికారాన్ని ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్య ప్రతి ఒక్కరికి అందినప్పుడు, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికి వైద్యం అందినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అప్పటివరకు ఈ రాష్ట్ర అభివృద్ధి చెందదు.

ఈ రాజకీయ నాయకులు దోచుకుంటున్న భూములు, ఇసుక క్వారీలు, అన్నిటిలో ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్ర ప్రజలకు వాటా ఉన్నదన్న విషయాన్ని మర్చిపోకూడదు. భవిష్యత్తులో జరగబోవు ఎన్నికలలో ఉత్తమైన వ్యక్తులకు, మేధావులకు, సంఘసంస్కర్తలకు ప్రజాసేవకులకు మాత్రమే ఓటేద్దాం. ఈ దొంగలకు ఓటేయటం బంద్ చేద్దాం. ఇట్లనే జరుగుతూ ఉంటే భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలు, భూ పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతది. ప్రజలందరికి లివింగ్ కాస్ట్ పెరిగిపోయి, ఆ లివింగ్ కాస్ట్ కు తగినంత సంపాదన లేక ఆర్దికంగా చితికిపోయి, చాలా దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాము. సుమారు మూడున్నర కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలకు పైగా తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నాయంటే, అర్థం చేసుకోండి మన పాలకులైన గాడిద కొడుకులు ఎంత అభివృద్ధి చేశారో, చేస్తున్నారో ఇది కాదా నిదర్శనం.

Post a Comment

0 Comments