భద్రాచలంలో మూడు దశాబ్దాలుగా ప్రతి ఏట అత్యంత ప్రతిష్టాకరంగా నిర్వహిస్తున్న 29వ నెహ్రూ కప్ అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు డిసెంబర్ 26 నుంచి జనవరి 5వ తేదీ వరకునిర్వహిస్తున్నట్లు నెహ్రూ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి,వాతాడి దుర్గా అశోక్ లు తెలిపారు. భద్రాచలంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నెహ్రూ కప్ షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది టోర్నమెంట్లో విజేతకు రూ.50,000 వేలు, ట్రోపి, రన్నర్స్ కు రూ.30,000 వేలు,ట్రోఫీ వీటితో పాటు టోర్నమెంట్లో ప్రతిభ చాటిన వారికి బెస్ట్ బ్యాట్స్ మాన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ తదితర అవార్డ్స్ తో పాటు వ్యక్తిగత బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొనేందుకు ఆసక్తిగల ప్రముఖ పేరొందిన క్రికెట్ జట్లు డిసెంబర్ 20వ తేదీలోగా తమ ఎంట్రీలను కన్వీనర్,ఎస్ కే సలీం,అబ్బాస్ ఫుట్ వేర్, క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా, భద్రాచలం, సెల్ 9440101108 అనే చిరునామాకు పంపించగలరని వెల్లడించారు గత 30 ఏళ్లుగా నెహ్రూ కప్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని, ఈసారి నిర్వహించే ఈ టోర్నమెంట్ కూడా ఎప్పటిలాగే అందరూ తమ అమూల్యమైన సలహాలు, సహకారం అందజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంట్ అధ్యక్షులు అట్లూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి దాట్ల శ్రీనివాసరాజు, కన్వీనర్ ఎస్కే సలీం, కోశాధికారి కుంచాల సదానందం (సిద్దు) ఉపాధ్యక్షులు గుమ్ములూరి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మడిపల్లి నాగార్జున తదితరులు పాల్గొన్నారు

0 Comments