రాజా శ్రీ తూములక్ష్మీ నృసింహదాసు వారి 234'జయంతి మహోత్సవం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మరియు శ్రీ రాజా తూములక్ష్మీ నరసింహదాసు సంకీర్తన సేవా సంస్థ వారి సమన్వయంతో నిర్వహించారు. ఉదయం దేవస్థాన A.E.O లు శ్రీ శ్రవణ్ కుమార్ గారు,భవాని రామకృష్ణగారు,వేద పండితులు గుదిమెళ్ళ మురళీ కృష్ణమాచార్యులు, లింగాల ప్రసాద్ గారు, సాయి బాబు గారు,ప్రధాన శ్రీ విజయ రాఘవాచార్యులు గారు, సిబ్బంది, ఎనిమిదవ తరం తూము వంశీకులు మరియు భక్తులు తో కూడి దేవస్థానము నుండి తాత గుడి వరకు భజనలు మరియు మహీధర్ హైదరాబాద్ బృందం వారి చే కోలాటంలతో గిరిప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద "రాజా శ్రీ తూములక్ష్మీ నరసింహదాసు సచిత్ర , మరియు వెబ్సైటు, శ్రీమతి కేఎల్ దుర్గా గారిచే రచించబడిన సీతా చాలీసా దేవస్థానం ,E.O శ్రీమతి L. రమాదేవి గారిచే ప్రారంభించారు.సాయంత్రం 3 నుండి 8:30 గంటల వరకు దేవస్థానం నిర్వహించే తెలంగాణ ప్రభుత్వ వేడుకలలో భాగంగా శ్రీ రాజా తూము నరసింహ దాసు సంకీర్తన సేవా సంస్థ సమన్వయంతో శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ నేమాని పార్థసారధి గారు, చెన్నై శాస్త్రీయ సంగీత కళాకారులు శ్రీమతి శ్వేత బాలసుబ్రమణియన్ బృందం,శ్రీమతి వేంపటి శ్యామల గారి బృందం తూము లక్ష్మీనృసింహ దాసు వారి కీర్తనలతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని సేవించుకున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ రాజా తూము లక్ష్మీనరసింహదాసు సంకీర్తనసేవా సంస్థ అధ్యక్షులు తూము వెంకటచంద్రశేఖర రావు గారు, సెక్రటరీ తూమురవి రాజుగారు, కోశాధికారి తూముఫణి గారు, మరియు వారి కుటుంబ సభ్యులు భక్తులు E.O గారికి ధన్యవాదములు తెలియజేశారు.
0 Comments