![]() |
| ఎంవీఐ ఎస్ వెంకట పుల్లయ్య |
వాహనాలు నడిపేటప్పుడు.విధిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కారులో ప్రయాణిస్తున్నప్పుడు తప్పనిసరిగా సీటు ధరించాలని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య పలువురు వాహనదారులకు అవగాహన కల్పించారు. మంగళవారం ఉదయం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విధులలో భాగంగా వాహన లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చిన పలువురుని ఉద్దేశించి తనదైన శైలిలో వాహనాలను నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. చిన్న పొరపాటు నిర్లక్ష్యం వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని హెల్మెట్ సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల జరిగే అనర్ధాలను, నష్టపోతున్న కుటుంబాలను ఉదహరిస్తూ, ముఖ్యంగా ఈ రోజుల్లో యువత మితిమీరిన వేగంతో ప్రాణాలు కోల్పోతున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు నష్టపోతున్నాయని, యాక్సిడెంట్ల వల్ల జరిగే నష్టాలను కళ్ళకు కట్టినట్లు చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని అందులో భాగంగా హెల్మెట్ వాడకం గురించి, అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు అప్రమత్తతో మెలగాలని ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని వాహనదారులకు సూచించారు. వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య కు ధన్యవాదాలు తెలిపారు.

0 Comments