Breaking News

Loading..

ఐ డి ఓ సి కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్టమస్ వేడుకలు..



ఐడిఓసి కార్యాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో శనివారం  సమావేశ మందిరంలో ఘనంగా సెమీ క్రిస్టమస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత సెమీ క్రిస్టమస్ కేక్ ను కలెక్టర్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందకరంగా ఉందన్నారు. క్రిస్టమస్ పండుగ శాంతి, సంతోషానికి, త్యాగానికి, ప్రేమ, కరుణకు తార్కాణంగా జరుపుకుంటామన్నారు. క్రీస్తు జీవనగమనం అందరికీ ఆచరణీయమని అన్నారు. క్రిస్మస్ పండుగ రోజును సంతోషంగా, ఆహ్లాదకర వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాక్షించారు. క్రీస్తు బోధనలు మంచి మార్గంలో నడిపిస్తాయన్నారు. అందరూ ఐకమత్యంతో మెలుగుతూ ఎదుటివారిని క్షమించే గుణాన్ని అలవరచుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, ఏవో రమాదేవి మరియు కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments