Breaking News

Loading..

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి..పెన్షనర్ల ధర్నా--మెమోరాండం సమర్పణ. ..

రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు ది 5 11 20 24న భద్రాచలం సబ్ ట్రెజరీ అధికారి కార్యాలయం ఎదుట ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు కె ఎస్ ఎల్ వి ప్రసాద్ చల్లగుల్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన మెమోరాండమును ఏ టి ఓ విష్ణు రావు, ఎస్ టి ఓ టి సుభద్ర గార్లకు అందజేసి మెమోరాండంను ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వము గారికి పంపించవలసినదిగా కోరారు. ఈ ధర్నాను ఉద్దేశించి అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ కుబేరులో పెండింగులో ఉన్న అన్ని రకాల ఏరియర్స్ బిల్లులను వెంటనే చెల్లించాలని. పి ఆర్ సి రిపోర్టును తెప్పించుకొని వెంటనే పిఆర్సిని అమలు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షులు చల్లగుల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కమ్యు టేషన్ను కోర్టుకు పోయిన వారికే కాకుండా జనరలైజ్ చేసి కోర్టుకు పోని వారికి కూడా వర్తింపచేయాలన్నారు. కమ్యూటేషన్ వాల్యు ఆఫ్ పెన్షన్ ని 15 సంవత్సరాలు కాకుండా 12 సంవత్సరాలకు రీస్టోర్ చేయాలన్నారు. ఈ ధర్నాకు సౌహార్ధ ప్రతినిధులుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ నాయకులు కొత్తగూడెం జిల్లా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు డెక్క నరసింహారావు, ప్రధాన కార్యదర్శి గగ్గూ రి బాలకృష్ణ, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ విజయ్ గార్లు హాజరై సత్వరమే సమస్యలు పరిష్కరించాలన్నారు. ముందుగా ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డివిజన్ కమిటీ నాయకులు సుబ్బయ్య చౌదరి, రాజబాబు, విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం, టీవీ చలం, దీకొండ వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ, శివ ప్రసాద్. విష్ణు మొలకల బదరీనాథ్. పోట్టా బత్తుల సత్యనారాయణ. తోట నాగేశ్వరరావు తదితరుల నాయకత్వంలో ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో పెన్షనర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని ప్లకార్డులు చేత పట్టి నినదించారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరమ్మ, అన్నపూర్ణాదేవి, సుందర నవమని, చంద్రావతి, ఉమాదేవి, వీ రంగయ్య, పుప్పాల నరసింహారావు తదితర పెన్షనర్ల నాయకులుపాల్గొన్నారు. 

Post a Comment

0 Comments