భద్రాచలం ఐటీడీఏ కేంద్రంగా ఆదివాసి విద్యార్థి జేఏసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కన్వీనర్ ఇరప ప్రకాష్ దోర మాట్లాడుతూ ఐ.టి.డీ.ఎ ల( భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూర్, మన్ననూర్ ) పరిధిలోని ఏజెన్సీ డీఎస్సీ తక్షణమే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహించాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది.
![]() |
| ఆదివాసి విద్యార్థి జేఏసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ |
డిసెంబర్ 9న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాను ఆదివాసీ నిరుద్యోగులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఐ. టి. డి. ఎ పరిధిలో ఏజెన్సీ డీఎస్సీ ఉండేది, ప్రస్తుతం జనరల్ డిఎస్సి వల్ల ఆదివాసులు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఐదో షెడ్యూల్ ఏరియా ఆదివాసి చట్టాలని పరిగణలో తీసుకొని ఆదివాసి నిరుద్యోగ అభ్యర్థుల కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, ఆదివాసుల అవిద్య, అమాయకత్వం, జీవన విధానాన్ని, పరిగణలోకి తీసుకొని ఆదివాసి నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరడం జరిగినది, ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి రాష్ట్ర కన్వీనర్ ఇరప. ప్రకాష్ దొర, ఆదివాసుల సర్పంచ్ ల సంఘం కన్వీనర్ పడిగ ప్రశాంత్ దొర, భద్రాచలం ఆదివాసి సమితి అధ్యాక్షులు పూనెం. కృష్ణ దొర, ముఖ్య సలహదారులు పూనెం. వీరభద్రం దొర, విద్యార్థి సంఘ నాయకులు, మహిళా సంఘ నాయకులు, తదితరులు పాల్గొనడం జరిగినది.

0 Comments