ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డివిజన్ ఆల్ పెన్షనర్స్
అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ బి కోటయ్య హైదరాబాదు నుండి మన కార్యాలయమునకు వచ్చిన సందర్భంలో గతంలో వారి సేవలను కొనియాడుతూ అధ్యక్షులు బందు ప్రసంగించారు. అనంతరం వారిని శాలువలతో డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి డి కృష్ణమూర్తి ఉపాధ్యక్షు లు సుబ్బయ్య చౌదరి రాజబాబు శివప్రసాద్ బద్రీనాథ్ మాదిరెడ్డి రామ్మోహనరావు ఐ వి సత్యనారాయణ తోట నాగేశ్వరరావు యేటకాని సత్యనారాయణ వీరభద్ర రావు సుబ్రహ్మణ్యం ఐలయ్య పంపన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారని ఒక ప్రకటనలో తెలిపారు.


0 Comments