బూర్గంపాడు పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ బూర్గంపాడు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు.వర్టికల్స్ వారీగా ఎవరికి కేటాయించిన విధులను వారు సమర్థవంతంగా నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని తెలిపారు.
గంజాయి వంటి మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు నిత్యం పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.విధుల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులో సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్,సీఐ వినయ్ కుమార్,ఎస్సైలు రాజేష్,నాగబిక్షం మరియు సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments