Breaking News

Loading..

జమిలి ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడవదు : కనకయ్య (CPM)

  • ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు ఎన్నిక వస్తే అప్పుడు నిర్వహించాల్సిందే
  • మహిళలకు బిజెపి పాలనలో రక్షణ లేదు 
  • ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని
  • ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు ఎన్నిక వస్తే అప్పుడు నిర్వహించాల్సిందే.
  • జమిలి ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడవదు  సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య .

సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య 

బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలతో దేశానికి ప్రమాదం అని ప్రజాస్వామ్యమైన భారత దేశంలో మోడీ విధానాలను ప్రజలు తిరస్కరించే రోజు దగ్గర్లోనే ఉందని  ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడవదని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు.బుధవారం పినపాక మండలం ఈ.బయ్యారం క్రాస్ రోడ్ లో గల ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో  మండల కమిటీ సభ్యులు, గ్రామ శాఖ కార్యదర్శిల సమావేశం మడివి రమేష్ అధ్యక్షతన  నిర్వహించారు. సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న రాక్షస  పాలన సాగిస్తోందన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చిన కాలం నుండి మహిళలపై అత్యాచారాలు, దాడులు అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు. అత్యాచారాల్లో యూపీ మొదటి స్థానంలో ఉందన్నారు. మహిళలు ఏ బట్టలు వేసుకోవాలో ఏం తినాలో కూడా బీజేపీ నాయకులే నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు .  బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలపై పన్నుల భారం పెరిగిందని మండిపడ్డారు.ఎర్రజెండా పేద ప్రజలకు అండగా ఉంటుందని బూర్జవ పార్టీలతో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ  ప్రజా సంక్షేమాన్ని మరిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల వల్ల పేద ప్రజల తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నిమ్మల వెంకన్న, మడివి రమేష్,నట్టి శంకరయ్య,వెంకటేశ్వర్లు, శాఖ కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments