ఎందుకు
మల్టీనేషనల్ కంపెనీల నీళ్ళకూ, కూల్ డ్రింకులకూ పురుగులు పట్టడం లేదు..??
ఖమ్మం, అక్టోబర్ 07, బిసిఎం10 న్యూస్.
ఎందుకని మల్టీనేషనల్ కంపెనీల నీళ్ళకూ, కూల్ డ్రింకులకూ పురుగులు పట్టడం లేదు..?? కాని, మనం ఇంట్లో తొట్టెల్లో పట్టిన నీళ్ళు రెండు రోజులకూ, మనం తయారు చేసుకునే పళ్ళరసాలు మర్నాటికే పాడైపోతున్నాయి..?? అవి మన ఇంటిలోని వాటికన్నా మంచివి అవ్వడం వల్లనా..!! కాదు, కాదు, కానే కాదు. మరి నిజం ఏమిటి..??
సహజంగా మనం తాగే నీరు, పిహెచ్ కనీసం 7 వరకూ వుండాలి. మనం ప్రతి రోజూ 20/- రూపాయల నుంచి 100/- వరకూ డబ్బు పెట్టి బస్టాండ్లలో/రైల్వేస్టేషన్లలో/ఎయిర్ పోర్ట్ ల్లో కొనుక్కుని తాగే కిన్లే, ఆక్వాఫినా, బిస్లరీ, బ్రెయిలీ ఇలా అనేక వాటర్ బాటిల్స్ లోని పిహెచ్ టెస్ట్ చేసి చూస్తే అవి కనీసం 5.5 కూడా లేదు. అంటే మనం ఎంతో ఆరోగ్యకరమైనవని అనుకుంటూ ఎంత భయంకరమైన ఎసిడిక్ కంటెంట్ వున్న నీటిని తాగుతున్నామో మనం ఆలోచించాలి, తెలుసుకోవాలి. న్యూస్ పేపర్లలో, టివి చానల్స్ లో ఆ మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి ఎవరికి వారు ఈ వ్యాపారంలోకి దిగారు. మనకు వాళ్ళ కంపెనీల ముద్ర వున్న నీరు మాత్రమే ఎంతో మంచిదని భ్రమ కలిగిస్తున్నారు. నిజానికి మనం తాగే నీరు ఆల్కలైన్ స్టేజ్ లో వుంటే రుచి తక్కువగా వుంటుందని, పుల్లగా వుండడం కోసం ఆ నీటిలో ఎసిడిక్ కంటెంట్ వుండేట్టుగా మన కార్పొరేషన్ నీరుని మారుస్తున్నారు. ఎసిడిక్ టేస్ట్ అంటే కొద్దిగా పుల్లని రుచితో మామూలు మంచి నీటికన్నా భిన్నమైన రుచితో వుంటుంది. మనం వారి అడ్వర్టైజ్ మెంట్లు చూసి ఆ నీరు కార్పొరేషన్ నీరు కన్నా శుద్దమైన నీరని, వారి వాటర్ కన్నా ఎంతెంతో మంచి నీరు అనే భ్రమలో అజ్ఞాన అంధకారంలో బతుకుతున్నాం. వాళ్ళు మామిడి పండు రసాన్ని విమర్శిస్తూ, మాజాని తాగమంటారు. బత్తాయి కమలా పళ్ళరసాల్ని విమర్శిస్తూ, ఆరెంజ్ డ్రింక్ తాగమంటారు. చదువుకున్న మనం తాగేవి మంచివనుకుంటూ, చదువుకోని వారు కూడా తాగుతున్నారు. ప్రకటనలో వారు చూపించేదంతా నిజమేనేమో అనుకుని అత్యంత భయంకరమైన ఏసిడ్ మీడియం ద్రావకాలను మనం తాగుతూ పసిపిల్లలకు కూడా తాగిస్తున్నాం. ఎసిడిక్ మీడియంలోని వస్తువులు తినడం వల్ల, తాగడం వల్ల, శరీరమంతా బలహీనమైనపోయి ఎక్కడలేని రోగాలతో సర్వనాశనమౌతున్నాం. కాన్సర్ పుండ్లు కాన్సర్ కణాలు అన్నీ ఎసిడిక్ మీడియంలోనే పెరుగుతాయి. ఆ కణాలు విపరీతంగా పెరగడానికి ఈ ఎసిడిక్ మీడియం నీళ్ళు, కూల్ డ్రింకులూ కారణమౌతాయి. ఆస్తమా, న్యుమోనియా వ్యాధుల తీవ్రతని ఎంతగానో పెంచుతాయి. అంతే కాదు రక్తంలో ఇంకా అనేక వ్యాధులు రావడానికి, గాల్ బ్లాడర్, లివర్, కిడ్నీలు సర్వనాశనమవ్వడానికి కారణమౌతుంది. అందుకనే ఆయుర్వేద వైద్యం వీలైనంత వరకూ మంచి నీటి బావినీరునే వాడుకోమని చెప్తుంది. లేదా మామూలుగా వచ్చే కుళాయిలోని నీటిని మామూలు ౩ కాండిల్స్ ఫిల్టర్స్ లో వేసుకుని త్రాగాలని సలహా ఇవ్వడం జరుగుతోంది. మనకు పుల్లని రుచితో వుండే ఈ ఎసిడిక్ నీళ్ళు కావాలో, ఆరోగ్యం కావాలో మనమే ఇక నిర్ణయించుకోవాలి. మనం రుచి కావాలనుకుంటే మంచి నీటిలో ఏలక్కాయల తొక్కులు వేసుకుని వాడుకోవచ్చు. మీకు ఇంకా పుల్లని నీరు తాగాలనిపిస్తే చక్కగా ఫ్రెష్ లెమన్ జ్యూస్ తీసుకుని తేనె వేసుకుని తాగచ్చు కదా ఈ కెమికల్ వాటర్ తాగి కుళ్ళి కుళ్ళి చావడం కన్నా, ఎవరో ఒక సినిమా స్టార్ చెప్తే మనం నమ్మి వాటిని మనం మన పిల్లలకి కూడ పట్టిస్తున్నాము. ఆ సినిమా హీరో కూల్ డ్రింక్ త్రాగుతుంటే చూసి వాళ్ళు తాగమని చెప్పే అత్యంత హానికరమైన కూల్ డ్రింకుల్నీ సోడాల్ని, బాటిల్డ్ వాటర్నీ ఎంతో డబ్బుపోసి కొంటున్నాం. అవి నిజంగా అంతగా హానికరం కావు అని నమ్మి స్వయంగా కన్న తల్లి తండ్రులే తమ పసిబిడ్డలకు కూడా ఆ ద్రావకాలను తాగించేస్తున్నారు. అనేక వ్యాధులకు కారణమౌతున్నారు. మనం చేసిన లెమన్ జ్యూస్ మర్నాటికి కంపు కొడుతుంది కదా, మరి కూల్ డ్రింకుల్లో ఎందుకు పురుగులు రావు. ఎందుకు రావంటే, పురుగుల మందు కలిపిన పదార్ధానికి పురుగులు పట్టవు కనక. ఆ కంపెనీల వారు తయారు చేసిన కూల్ డ్రింకులకు షెల్ఫ్ లైఫ్ పెరగడానికి వారు పురుగు మందులతో పాటు అంతకన్నా ఎంతో ప్రమాదకరమైన కెమికల్స్ ని, ప్రిజర్వేటివ్స్ పేరుతోనూ ఎసిటిక్ ఏసిడ్ కలిపి చేసిన ద్రవ పదార్థాల వల్లా, ఆహర పదార్థాల వల్లా ఎన్నో ఏసిడ్స్ మన ఒంట్లోకి ప్రవేశించి కేన్సర్ కి, ఆస్తమా కి, ఆర్థరైటిస్, జాండిస్, డయబిటిస్ వంటి అనేక రుగ్మతలు పెరగడానికి కారణమౌతున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు వేసే భయంకరమై వేషాలు, చేసే అతి నీచమైన మోసాలూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యరు, చెయ్యలేరు. ఆస్థమా, ఆర్థైటిస్ డయబెటిస్ లో, బిపి హైబిపిలు వచ్చేట్టు చేసేది వాళ్ళు తయారు చేసిన ఆహారాలే. ఆ రోగాలు ఎలా వస్తాయో తెలియదని చెప్పేది వారే. ఒకసారి రోగం వస్తే తమ మందులను జీవితమంతా వాడాల్సిందే అని చెప్పేదీ వారే. 'పిల్లి గుడ్డిదైతే ఎలక ఎదురు నిలబడి ఎకసక్కెం చేసిందనే' సామెత నేడు భారత దేశంలో ఎంతో నిజం. సింపుల్ గా అర్థమయ్యేట్టు చెప్పాలంటే మనం తాగే ఆక్వాఫినా, కిన్లే, బిస్ లరీ బాటిల్స్ లో సప్లై చేసే నీరు ఒక గ్లాసు తాగితే అది కనీసం ఒక 12 గ్లాసుల ఆల్కలైన్ వాటర్ తాగితే కానీ న్యూట్రల్ కాదు. ఇక కిన్లే, బిస్లరీ సోడాలూ, కూల్ డ్రింకులు ఒక గ్లాస్ నీరు తాగితే కనీసం 24 గ్లాసుల ఆల్కలైన్ నీరు త్రాగితే కానీ మళ్ళీ ఆ నీరులోని ఏసిడ్ నార్మల్ కాదు.
◆ మరి శాశ్వత పరిష్కారం ఏంటి.
ఆ నీటికన్నా మన కార్పొరేషన్ వారు ప్రతి రోజూ మన ఇళ్ళకి సప్లై చేస్తున్న మంచి నీరు కనీసం 12 రెట్లు మంచి నీరు. దానిని హాయిగా మామూలు ఫిల్టర్ల లో పోసుకుని త్రాగడమ్ ఎంతో మంచిది. అందరం ఆర్టిఫిషల్ గా బావి నీటిని స్టీల్ బబుల్లో సున్నపురాయి, మట్టి, ఇటుక, కర్రబొగ్గు, నది ఇసుక, గులక రాళ్లు, రాగి పలక వేసి తయారు చేసింది పెట్టుకుందాం. ఆ నీటిలో 8.5 పిహెచ్ కలిగి ఉంటుంది. ఈ నీటిని మట్టికుండలో పోసి చూస్తే 9.5 పిహెచ్ వరకూ ఉంటుంది. లేదా పాత ఫిల్టర్లు వుండేవి మూడు కాల్షియం కాండిల్స్ వుండే ఫిల్టర్లు అలాంటివి అయినా మంచివే. ఆ నీటిని కొద్దిగా వేడిగా ప్రతి రోజూ ఉదయం మూడు గ్లాసులు తాగితే దగ్గూ జలుబూ ఆస్థమా వ్యాధులు, వైరల్ జ్వరాలూ తగ్గుముఖం పడతాయి. కిడ్నీ వ్యాధులు జాండిస్ లూ రాకుండా ఉంటాయి.
◆ ఊరు వెళ్తుంటే బద్దకం వదిలెయ్యండి.
ఏదైనా ఊరు వెళితే చక్కగా మీ నీళ్లని, దానిలో వున్న మీ ఆరోగ్య్యాన్ని, మీ చేత్తో ఒక బ్యాగ్ లో తీసుకుని వెళ్ళండి. అది వీలు కాలేదా. ఆ నీళ్ళు అయిపోతే ఎక్కడ ఏ మనుషులు సాధారణంగా ఏ నీరు త్రాగుతున్నారో ఆ నీరును మీరు కూడా త్రాగండి. ఎంత దూరప్రాంతాలకు వెళ్ళినా బాటిల్ వాటర్ త్రాగి కేన్సర్లు తెచ్చుకోవద్దు. ప్రపంచ మానవజాతికి దారిని చూపించే దేశం నుంచి వచ్చిన మనం చివరికి మనం తాగే మంచి నీళ్ళకోసం కూడా ఆ స్వార్ధ వ్యాపార దృష్టితో పనిచేస్తున్న మల్టీనేషనల్ కంపెనీల పై ఆధారపడాలా..?? భారతీయులమైన మనం ముందుగా మన వాళ్ళని రక్షించుకుందాం. తరువాతి తరాలకు దారిచూపిద్దాం,
దార్శనికులమై నిలబడదాం.


0 Comments