'జీవో 29' ఎవరి పాలిట ఉరితాడు కాబోతుంది..!!
● 'జీవో 29' ఏ వర్గాలకు అన్యాయం చేస్తుంది.
● 'జీవో 55' పరీక్ష నిర్వహణ ఎందుకు కోరుకుంటున్నారు.
● ఓపెన్ క్యాటగిరిలో అన్ని వర్గాలకు అవకాశాన్ని ఎందుకు తూట్లు పొడిచారు.
● గ్రూప్ వన్ పరీక్ష రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైనది దాని పై ప్రభుత్వం ఎందుకు వివాదం చేస్తుంది.
● బిసి, ఎస్సి, ఎస్టి విద్యార్థులకు ప్రభుత్వమే న్యాయం చేయాలి.
ఖమ్మం, అక్టోబర్ 25, బిసిఎం10 న్యూస్.
గత ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహణ కోసం జీవో 55 పద్ధతి ద్వారా ప్రిలిమ్స్ మెయిన్స్ అర్హత పొందిన విద్యార్థులు రిజర్వేషన్లు కాకుండా మెరిట్లో ఓపెన్ క్యాటగిరిలో కూడా ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది కానీ గతంలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవోను వ్యతిరేకించి బయోమెట్రిక్ ద్వారా పరీక్ష నిర్వహించినందుకు కొన్ని అవకతవకలు జరిగాయని సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్లడం జరిగింది. ఆ సమయంలో విద్యార్థి లోకం కేసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. నిరుద్యోగులు అందరూ కూడా కాంగ్రెస్ వైపు నిలబడి తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని కాంగ్రెస్ నాయకులను కోరారు. నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు బలంగా నిలవడం వల్ల బిసి, ఎస్సి, ఎస్టి సామాజిక వర్గాలు రాహుల్ గాంధీ చేప్పిన సమ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరికి ఎవరికి రావాల్సినంత వాటా వారికి రావాలని, దేశంలో సమగ్ర కులగనలను చేపట్టి 'మేమెంత మంది - మాకు ఎంత వాటా' అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. దాన్ని స్వాగతించిన బిసి, ఎస్సి, ఎస్టి మైనార్టీలు కాంగ్రెస్ కి అధికారం కట్టబెటారు. ఒకవైపు నిరుద్యోగులు బిసి, ఎస్సి, ఎస్టి మైనార్టీలు అందరు కలిసి కాంగ్రెస్ అధికారానికి ముఖ్య భూమిక పోషించారు. ఇక్కడొక విషయం 'జీవో 55'ని రద్దు చేయాలని ఆనాటి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి హైకోర్టు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఆనాటి ప్రభుత్వం అవలంబించిన తీరు చాలావరకు విమర్శలకు దారి తీయడం, బయోమెట్రిక్ పద్ధతిలో వాడడం, అది కొంతమంది విద్యార్థులకు ఇబ్బందులు కలిగించడం, చివరగా కోర్టు రీజన్ కి పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడు జీవో 55 కి బదులుగా కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 ని గతంలో 503 పోస్టులు ఉంటే దానికి అదనంగా 60 పోస్టులను కలుపుతూ 563 పోస్టులకు గాను జీవో 29 వర్తిస్తుంది అని ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ జారీ చేసారు. ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కేమిటంటే వారు ఇచ్చిన జీవో 29 లో ఒక కొత్త మెలక పెట్టడం జరిగింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ సిస్టంలకు వ్యతిరేకంగా రిక్రూట్మెంట్ పద్ధతికి భిన్నంగా జీవో ఉండడం, బిసి, ఎస్సి , ఎస్టి వర్గాలకు తీవ్రని అన్యాయం జరుగుతుంది. ఇది కేవలం ఈ పరీక్ష వరకే కాదు భవిష్యత్తు పరీక్షలకు కూడా దీన్ని అవలంబిస్తే ఈ సామాజిక వర్గాలకు ఉద్యోగాలలో తీరని నష్టం జరగడమే కాక ఉన్నతమైన ఉద్యోగాలకు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది. జీవో 29 లో స్పష్టంగా పారబీలో రూల్ 21, 22 లో వారు చెప్పింది ఏమిటంటే బిసి, ఎస్సి, ఎస్టి విద్యార్థులు టాప్ మెరిట్ ర్యాంక్ సాధించినప్పటికి వారు రిజర్వేషన్లు ప్రకారం మాత్రమే ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, మెరిట్ విద్యార్థులు ఓపెన్ క్యాటగిరీ జనరల్ లో వారు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది, కానీ జీవో 29 లో అది లేకుండా చేశారు. జనరల్ కోటాలో ఓసీలు, ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నవాళ్లకు ప్రథమ ప్రియారిటి ఇచ్చి వాళ్లకు ఉద్యోగ కల్పన చేసే విధంగా ఈ జీవోను తీసుకురావడం జరిగింది. అంటే 1: 50 లో ప్రతి పోస్ట్ కు అర్హులను పిలుస్తారు. బిసి, ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లు ఉన్న వాళ్లకు 303 పోస్టులకు గాను ఈ 1: 50 రేషియో పద్ధతిలో 15,150 విద్యార్థులు మాత్రమే అర్హత పొందుతారు. ఇక ఓసిలకు 260 పోస్టులకు గాను 1: 50 పద్ధతిలో 13,000 విద్యార్థులు అర్హత పొందుతారు. కేవలం ఆరు శాతం ఉన్న ప్రజలకు ఇంత ఎక్కువ అవకాశం ఇస్తే, 95% ఉన్న ప్రజలకు అన్యాయం చేసినట్టే అవుతుంది. కళ్ళ ముందు అన్యాయం కనబదుతున్నా, మరొక విషయం ఏమిటంటే షాట్ ఫాల్ పద్ధతి బిసి, ఎస్సి, ఎస్టి లలో ఏ విద్యార్థుల్ని పిలిచిన సంఖ్య కన్నా అర్హుల అర్హులు తప్పుంటే, వారికి బదులుగా ఆ కాలీలకు ఓసీలను అర్హులుగా పిలుస్తారు, దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చిన మరచిక్కు ఏమిటంటే మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ లో 28,150 మందికి గాను 32,000 పైచిలుకు మంది పరీక్ష రాసారు. అదనంగా 3,000 మంది ఎట్లా వ్రాశారు. దాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అనేది ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టంగా చెప్పలేదు. ఇది పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది, అంటే ఈ అదనంగా వ్రాసిన వ్యక్తులకు ప్రభుత్వం దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెడుతున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. మరొకటి విద్యార్థులు ఈ జీవోకు వ్యతిరేకంగా తీవ్రమైన నిరసన కార్యక్రమం, నిర్వహిస్తే ప్రభుత్వం వారి పై లాఠీచార్జీలు చేయడం, కొంతమందిని అరెస్టు చేయడం జరిగింది. దీనివల్ల నాలుగు వేల మంది విద్యార్థులు ఈ పరీక్ష వ్రాయలేకపోయారన్నది మనకున్న సమాచారం. చివరిగా జీవో 29 రాజ్యాంగ వ్యతిరేకమని సుస్పష్టంగా అర్థమవుతుంది, కోర్టులో ఇది నిలవదని మళ్లీ రీజన్ కండక్ట్ అయ్యేవరకు కూడా బిసి, ఎస్సి, ఎస్టిలు పోరాటం చేసే అవకాశం కూడా ఉందని, దీనికి ప్రతిపక్షాలు కూడా తోడై ఉద్యమిస్తాయని చివరిగా లెఫ్ట్ పార్టీలు, బహుజన పార్టీలు కూడా పెద్ద ఎత్తున జీవో 29 కి వ్యతిరేకంగా గల మెత్తడం ప్రభుత్వానికి కొరకరానికోయిగా మారబోతుంది. కాబట్టి ప్రభుత్వం విద్వేశజాలకు పోకుండా 'సమ సమాజ నిర్మాణానికి' అవకాశం ఇచ్చే విధంగా విద్యార్థులకు న్యాయం చేసేలా 'జీవో 29' ను రద్దు చేసి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వక ముందే ప్రభుత్వం చేసిన ఈ చిన్న తప్పిదాన్ని సవరించి, జీవో 55 ద్వారా లోకల్ విద్యార్థులకు 95% అవకాశం వచ్చే విధంగా చూస్తూ మరింత మెరుగైన జీవోను తీసుకొచ్చి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని, శాంతి భద్రతను కాపాడాలని తెలంగాణా ను భారత దేశంలో అగ్రహారంగా నిలిపి ఆదర్శప్రాయంగా ఉంచాలని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిని కోరుతున్న నిరుద్యోగులు.

0 Comments