కమ్యూనిస్టు పార్టీ దేశ నేత సీతారాం ఏచూరి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్, ఏఐసీసీ మెంబర్, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు, భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
దేశ రాజకీయాల్లో సీతారాం ఏచూరి తనదైన శైలిలో పాత్ర పోషించారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు చేసిన ఘనత సీతారాంకే దక్కిందన్నారు. విద్యార్థి నేతగా, రాజ్యసభ సభ్యుడిగా అనేక సేవలందించారని తెలిపారు. దేశ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేశారు.సీతారాం ఏచూరి లేని లోటు తీరనిది అని వ్యాఖ్యానించారు


0 Comments