ఖమ్మం, 14 సెప్టెంబర్, బిసిఎం10 న్యూస్.
ఈ నెల 16 గణేష్ విగ్రహాల శోభయాత్ర, నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 16న (సోమవారం) మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 ఉదయం 6 గంటల నుండి 17 ఉదయం 6 గంటల వరకు కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు (మద్యం దుకాణాలు), మద్యం సరఫరా చేసే బార్ & రెస్టారెంట్లు, క్లబ్‌లు, హోటళ్ళు మూసివేయాలని ఆదేశించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
◆ ఖచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము.
గణేష్ నిమజ్జన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఖచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసృన్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. గణేష్ నిమజ్జనం, బందోబస్తు ఏర్పాట్ల పై ఆయన పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్లతో ఏ చిన్న సంఘటనకు అస్కారం లేకుండా భక్తులు/సందర్శకులు క్షేమంగా తిరిగి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని, నిమజ్జనం ప్రాంతాలలో బారిగెట్లు, క్రేన్లు, గజ ఈతగాళ్లు, మత్యకారులు, లైఫ్ జాకెట్లు, పడవలను అందుబాటులో ఉంచాలని, విధ్యుత్ శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్, మత్యశాఖ అధికారుల సమన్వయంతో ప్రశాంతంగా నిమజ్జనం కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందిగా ట్రాఫిక్ నిర్వహణ వుండాలన్నారు. ఊరేగింపు, నిజమజ్జనాల సమయంలో మద్యం సేవించడం, సాధారణ జన జీవనానికి ఇబ్బంది కలిగించడం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా ప్రవర్తించడం వంటి చర్యలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు, నిజమజ్జనాల నిర్వహణ పై మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. భక్తులు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అధికారులకు సూచనలు చేశారు. వర్షాలు ఎక్కువగా ఉన్నందున నిమజ్ఞన కార్యక్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సమారు 27 వేల గణేష్ విగ్రహాలు రిజిస్టర్ అయిన విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. ఈ రోజు వరకు 243 విగ్రహాలు నిమజ్జనం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి నరేష్ కుమార్, అడిషనల్ డిసిపి ప్రసాద్ రావు, ఏసిపి సంబారాజు తదితరులు పాల్గొన్నారు.
0 Comments