ఖమ్మం, సెప్టెంబర్ 17, బిసిఎం10 న్యూస్.
ఖమ్మం బిసి కాలనీలో 58 వ డివిజన్ విశ్వకర్మ ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి
మహోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైపాస్ రోడ్డునుచి బిసి కాలనీలోని విశ్వకర్మ జండా వరకూ విశ్వకర్మ భక్తి గీతాలు, కోలాట నృత్యాలతో శోభాయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఐక్యవేదిక అధ్యక్షులు శ్రీ కందుకూరి శంకర్ చారి విశ్వకర్మ జండా ఆవిష్కరించారు. సంఘసభ్యుల ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ భగవాన్ పూజా కార్యక్రమం, విశ్వకర్మ మహా హెూమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ పురోహితులు శ్రీ రామగిరి దామోదరచారి పురోహితులుగా వ్యావహారించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు మహాన్నప్రసాద వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కన్నె కంటి కృష్ణాచారి, గౌరవ అధ్యక్షులు విరండి విశ్వనాథ చారి, కోశాధికారి మడుపు శ్రీనివాస చారి, ఉపాధ్యక్షులు పాలకి వెంకటాచారి, సహాయ కార్యదర్శి కన్నెకంటి శంకర్, సలహాదారులు పాలడుగు నాగేశ్వర రావు, గౌరవ సలహాదారులు సరికొండ వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షులు కన్నె కంటి రామాచారి, మాజీ అధ్యక్షులు కందుకూరి వెంకటేశ్వర్లు, మాజీ ప్రధాన కార్యదర్శి సోమ నాగరాజు, కొప్పుల చంద్రశేఖర్ బోడ వీరన్న మరియు స్థానిక 58వ డివిజన్ విశ్వకర్మ కుటుంబాలు, బీసీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

0 Comments