Breaking News

Loading..

విుషన్ భగీరద కార్మికుల 5 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి -CITU

 మిషన్ భగీరథ మంచినీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న భద్రాచలం కార్మికులకు రావాల్సిన 5 నెలల వేతన బకాయిలు, దుమ్ముగూడెం మండలం కార్మికులకు రావాల్సిన నాలుగు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి, సిఐటియు భద్రాచలం పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి డిమాండ్ చేశారు .నెలల తరబడి వేతనాలు రాకుండా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు పేర్కొన్నది .

అధికారులకు కాంట్రాక్టర్ కు అనేకసార్లు కార్మికులు వారి గోడు వెళ్ళబోసుకున్నప్పటికీ స్పందన కరువైందని పేర్కొన్నారు. 18 నెలలుగా తమకు రావలసిన బిల్లులు ప్రభుత్వ నుంచి రాలేదని అందువల్లనే తాము జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని మన వైపు కాంట్రాక్టర్ చెబుతున్నారు .ఎండ ,వాన చలి అనే తేడా లేకుండా మంచినీళ్లు సరఫరా చేస్తూ పైప్ లైన్ లో ఎక్కడ ఏ ఆటంకం ఏర్పడిన రిపేర్లు చేస్తూ ప్రజలకు త్రాగునీరు అందిస్తున్న మిషన్ భగీరథ కార్మికుల పట్ల ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని సిఐటియు పేర్కొన్నది. ఒకవైపు విష జ్వరాలతోటి కార్మికులు, కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వైద్యానికి, పిల్లల చదువుకు, కుటుంబ పోషణకు అప్పులు చేయలేని దుస్థితి ఏర్పడిందని నెలలు తరబడి వేతనాలు రాకపోతే పైసా కూడా అప్పు పుట్టనటువంటి పరిస్థితుల్లో కార్మికులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. పలువురు కార్మికుల కుటుంబాలు హాస్పటల్లో వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక అవస్థలు పడుతున్న పరిస్థితి ఉందని సిఐటియు పేర్కొన్నది. ప్రజా పాలనని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం చిన్నచిన్న కార్మికులకు ఇచ్చే కొద్దిపాటి వేతనాలు కూడా నెలలు తరబడి చెల్లించకుండా పెండింగ్లో ఉంచటం ఏ విధంగా ప్రజాపాలన అవుతుందోప్రభుత్వం సమాధానం చెప్పాలని సిఐటియు ప్రశ్నించింది. ప్రభుత్వం వేతనాలు చెల్లించని కారణంగానే మంచినీటి సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని, విధులు బహిష్కరించాలని మిషన్ భగీరథ కార్మికులు నిర్ణయం తీసుకున్నారని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ,మిషన్ భగీరథ అధికారులు బాధ్యత వహించాలని సిఐటియు డిమాండ్ చేసింది .ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని బకాయి వేతనాలు చెల్లించాలని సిఐటియు కోరింది. ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. మిషన్ భగీరథ కార్మికులు నిర్వహించే విధుల బహిష్కరణ సమ్మె పోరాటానికి సిఐటియు నాయకత్వం వహిస్తుందని నాయకులు తెలిపారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పట్టణ నాయకులు ఎం నాగరాజు, గడ్డం స్వామి ,బండారు శరత్ బాబు, అప్పారి రాము. తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments