భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామంలో 60,000 వేలు పైచిలుకు జనాభా నివసిస్తున్నారు.నిత్యం రహదారి రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతంలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. బస్టాండ్ లేకపోవడంతో ఆ ప్రాంత ప్రజలందరూ రహదారిపైనే ఎండైనా వానైనా ఉంటూ ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతున్నారు.
ఇటీవల కాలంలో ఎన్హెచ్ రహదారి అభివృద్ధి జరిగిన క్రమంలో బస్టాండ్ తొలగించారు బస్టాండ్ ప్రాంతంలో నూతన బస్టాండు నిర్మాణం చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతూ ఉన్నారు.ఆ ప్రాంతంలో బస్సు షెల్టర్ నిర్మాణం చేసి ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని బస్టాండ్ స్థలాన్ని కబ్జా చేసే అవకాశాలు ఉన్నాయని వెంటనే ఆ స్థలాన్ని కాపాడాలని సదరు బూర్గంపాడు తాసిల్దార్ ముజాహిద్ కు స్థానికులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. భద్రాచలం డిపో మేనేజర్ కు కూడా సమాచారాన్ని అందజేశారు తెలుసుకున్న తాసిల్దార్ పక్షం చర్యలు తీసుకుంటారని బస్టాండ్ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
0 Comments