Breaking News

Loading..

భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం నలుగురు నిందితుల అరెస్ట్ – కారు, ఐదు మొబైల్ ఫోన్లు సీజ్..

భద్రాచలం, జూలై 25 (BCM10 NEWS): భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు వీరభద్రం ఫంక్షన్ హాల్ సమీపంలోని కూనవరం రోడ్డుపై నిర్వహించిన తనిఖీల్లో ఈ పట్టివేత చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని మోతుగూడెం ప్రాంతం నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 101 కిలోల డ్రై గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ KA-03-NR-5892 గల మారుతి ఎర్టిగా కారుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు సలీం పాషా (53), ఈ. రాజేంద్ర ప్రసాద్ (34), ఎం.డి. అర్బాజ్ హుస్సేన్ (22), ఎస్. గుల్జార్ (35)గా గుర్తించారు.ప్రాథమిక విచారణలో నిందితులు భద్రాచలం–ఖమ్మం మార్గం గుండా బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్నట్లు వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఈ దాడిలో సీఐ రహీమున్నీసా, ఎస్‌ఐ సీతారామరాజు, హెడ్ కానిస్టేబుల్ కరీమ్‌తో పాటు పోలీసు సిబ్బంది భద్రం, సీతారాం, రాకేష్, రవి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments