Breaking News

Loading..

నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి. సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన..

సోనం వాంగ్ చుక్ చేస్తున్న ఆమరణ దీక్షను భగ్నం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించండి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్..


విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటమాడి నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి కారకుడైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, సోనం వాంగ్చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ అన్నారు. సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లోని అమరవీరుల స్తూపాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఏజే రమేష్ మాట్లాడుతూ అనేక ఆశలతో నీట్ పరీక్షలు రాసిన 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష పత్రాల లీకేజీ తో తీవ్ర ఆవేదనకు లోనయ్యారని, తీవ్ర మనస్థాపానికి గురై 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ చర్యకు బాధ్యత వహిస్తూ కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత 25 రోజులుగా కాక్రోస్ జనతా పార్టీ, వామపక్ష విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ప్రముఖ పర్యావరణ వేత్త సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ 22 రోజులుగా ఆమరణ దీక్ష చేసిన కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. హైకోర్టు జోక్యం చేసుకొని ప్రాణాలకు హాని జరగకుండా వారితో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని చెబితే దాన్ని ఆసరాగా తీసుకొని నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్ చుక్ ను బలవంతంగా, దౌర్జన్యంగా మిలిటరీ బలగాలతోటి దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేసి హాస్పటల్ తరలించారని ఇది హేయమైన చర్య అని అన్నారు. అయినా చుక్ హాస్పటల్లో సైతం దీక్ష కొనసాగిస్తున్నారని అన్నారు. వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లిన సిపిఐఎం అఖిల భారత కార్యదర్శి ఎంఏ బేబీని సైతం పోలీసులు అడ్డుకున్నారని అన్నారు .చుక్ దీక్షను భగ్నం చేసిన అదే వేదిక పైన కాక్రో జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ తో పాటు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆదర్శ్,మరియు వైస్ ప్రెసిడెంట్ ఐసే గోష్ లు నిరాహారదీక్షకు దిగారని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఈరోజు వేలాదిమంది విద్యార్థులు ఈ ఉద్యమానికి మద్దతుగా పార్లమెంటు మార్చ్ నిర్వహిస్తున్నారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను భర్త రఫ్ చేయాలని విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలను సరి చేసే పద్ధతిలో కేంద్ర విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి కారం పుల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట రామారావు, పి సంతోష్ కుమార్ పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, నకిరేకంటి నాగరాజు అజయ్ కుమార్, కొలగాని రమేష్,ధనకొండ రాఘవయ్య డి కనక శ్రీ ,కోరాడ శ్రీనివాస్,సండ్ర భూపేంద్ర, సీనియర్ నాయకులు ఎం వి ఎస్ నారాయణ, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments