- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
- NTAను రద్దు చేయాలి.
- ఢిల్లీలో విద్యార్థి యువత పై జరిగిన పోలీస్ దాడులపై పారదర్శకంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ డిమాండ్.
- ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్.
భద్రాచలం జూలై 23 విషయం బిసిఎం10 న్యూస్ : భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI)రేపు నిర్వహించనున్న వామపక్ష విద్యార్థి సంఘాల విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీందర్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థి యువజన సంఘాలపై పోలీసులు టియర్ గ్యాస్ లాఠీ ఛార్జ్ బలప్రయోగానికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఘటనపై స్వాతంత్రంగా పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొప్పుల రవీందర్ డిమాండ్ చేశారు.దేశంలో విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, పరీక్షల నిర్వహణపై నెలకొన్న అనుమానాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.జాతీయ పరీక్షల నిర్వహణలో వరుసగా తలెత్తుతున్న లోపాల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాతీయ పరీక్షల సంస్థ (NTA)ను రద్దు చేసి, పారదర్శకత, జవాబుదారీతనం, విశ్వసనీయత కలిగిన కొత్త పరీక్షల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.అలాగే విద్యార్థుల సమస్యలను అణచివేయడం కాకుండా, వారి న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. పై డిమాండ్ల సాధన కోసం రేపు నిర్వహించనున్న వామపక్ష విద్యార్థి సంఘాల విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్తి మద్దతు తెలిపి విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీందర్ కోరారు. ఈ కార్యక్రమంలో సూర్య, ప్రశాంత్, అనిల్, సాయికిరణ్, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.

0 Comments