Breaking News

Loading..

లయన్స్ క్లబ్ అధ్యక్షురాలిగా పానుగంటి సమత శ్రీనివాస్.


నూతన కార్యవర్గంతో లయన్స్ క్లబ్ సభ్యులు 

బిసిఎం10 న్యూస్ మే 26 భద్రాచలం

భద్రాచలం లయన్స్ క్లబ్  రానున్న 2026-27 లయన్స్ సంవత్సరానికి అధ్యక్షురాలిగా క్రాంతి విద్యాలయం కరస్పాండెంట్ పానుగంటి సమత శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు పిన్నింటి కమల కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో సమతను నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించవలసిందిగా సభ్యులు కోరగా అందుకు ఆమె అంగీకరించారు. ఇదే క్రమంలో వ్యాపారవేత అనుగోజు నరసింహచారి కార్యదర్శిగా, టౌన్ భద్ర రెస్టారెంట్ బాధ్యులు పవన్ కుమార్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పానుగంటి సమత శ్రీనివాస్ మాట్లాడుతూ అధ్యక్షురాలిగా లయన్స్ క్లబ్ సీనియర్ల బాటలో నడిచి తాను, టీమందరము కలిసి క్లబ్ జిల్లాలో మొదటి స్థానంలో ఉంచుతామన్నారు. క్లబ్బులోని మాజీ అధ్యక్షులకు,సభ్యులకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం ప్రెసిడెంట్ కమల కుమారి మాట్లాడుతూ తాను బాధ్యతలు వహించిన సంవత్సరంలో  చాలా మంచి కార్యక్రమాలు చేశామని తెలిపారు. జూలై 1 నుంచి నూతన కార్యవర్గం బాధ్యతలు తీసుకుంటుందని ఆమె ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ రీజియన్ చైర్ పర్సన్ సోమరౌతు శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు పరిమి సోమశేఖర్, సీనియర్ సభ్యులు బోనాల సూర్యనారాయణ,వాసు , క్రాంతి విద్యాలయం అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

Post a Comment

0 Comments