Breaking News

Loading..

ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం కావాలి..సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ జె రమేష్.

 

  • ఘనంగా "తాతోలు" ఉద్యోగ విరమణ కార్యక్రమం
  • సిఐటియు- సిపిఎం ఆధ్వర్యంలో సత్కారం.

బిసీఎం 10 న్యూస్ మే 03 భద్రాచలం : ఉద్యోగ విరమణ అనంతరం తన శేష జీవితం ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ జె రమేష్ అన్నారు. తెలంగాణ ఆర్టీసీలో 38 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న తాతోలు దుర్గాచారి గారు తన శేష జీవితం ప్రజా సమస్యలు, కార్మిక సమస్యలపై కృషి చేయాలని అన్నారు.  దుర్గాచారి గారు కవిగా, రచయితగా, గాయకుడిగా సాహిత్య రంగంలో తన కృషిని కొనసాగించాలని అన్నారు. తాతోలు దుర్గా చారి గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సిపిఎం, సిఐటియు నాయకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, సిఐటియు నాయకులు  నకరికంటి నాగరాజు, అజయ్ కుమార్, కోరాడ శ్రీనివాస్, ఎం వి ఎస్ నారాయణ, బి జె ఎల్ పి దాసు, ముత్తయ్య, మురళీకృష్ణ,ఎస్ఎఫ్ఐ రవీందర్, రవి తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments