తెలంగాణ ఆల్ పెన్షనర్స్అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆరవ రాష్ట్ర మహాసభలు ఈ నెల 29,30 తేదీలలో హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో నిర్వహించబడతాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు తెలిపారు.
శనివారం భద్రాచలం ఆల్ పెన్షనర్స్ డివిజన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సభల్లో 20 24 మార్చి తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ఐదు డి ఎ, లను నూతన పి ఆర్ సి ని హెల్త్ కార్డులపై అన్ని కార్పోరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యాన్ని అందించాలని పలు తీర్మానాలను మహాసభలో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు.
ఈ సభలకు పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ సభలకు జాతీయ పెన్షనర్ల సంఘం సెక్రటరీ జనరల్ రాఘవేంద్ర కృష్ణ న్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, తెలంగాణ ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఈ శ్రీనివాసరావు, జాతీయ ఉపాధ్యాయ సమాఖ్య సెక్రటరీ జనరల్ చావా రవి, మాజీ ఎన్జీవో నాయకులు యు. ఆంజనేయులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, జాతీయ పెన్షనర్ల నాయకులు ఎం ఎన్ రెడ్డి, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్(టాప్రా) రాష్ట్ర అధ్యక్షులు పోతుల నారాయణరెడ్డి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి ఇతరులు హాజరవుతారని తెలిపారు.
ఈ సమావేశంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు.గౌరవ అధ్యక్షులు చంద్ర సుబ్బయ్య చౌదరి ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్.కోశాధికారి డి కృష్ణమూర్తి సహాయ కోశాధికారి నాళం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

0 Comments