Breaking News

Loading..

డా కేర్ హోమియోపతి ఫ్రీ మెడికల్ క్యాంప్.


ఖమ్మం, ఆగస్టు 25, బిసిఎం10 న్యూస్.

'డా కేర్ హోమియోపతి' ఆధ్వర్యంలో హోమియో వైద్యం పై అవగాహన సదస్సు, ఫ్రీ మెడికల్ క్యాంపును రిలయన్స్ ట్రెండ్స్ బిల్డింగ్ సముదాయం దగ్గర సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డా కేర్ హోమియోపతి బ్రాంచ్ డాక్టర్లు, ఇతర స్టాఫ్ పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహిచారు. ఈ క్యాంపులో సుమారు వంద మందికి పైగా రిలయన్స్ ట్రెండ్స్, భీమా జ్వలరీస్ స్టాఫ్ కు, చుట్టుపక్కల వ్యాపారస్తులకు ఫ్రీగా బిపి, షుగర్ మొదలగు పరీక్షలు చేసి ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ షేక్ అష్రఫ్ఉద్దీన్, డాక్టర్ టి ఉషారాణి మాట్లాడుతూ 'డా కేర్' సంస్థ సిఎండి డా ఏఎం రెడ్డి సహకారంతో పట్టణ వ్యాప్తంగా ఉచిత మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తూ హోమియో వైద్యం పై అవగాహన అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా హోమియోపతి మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చక్కటి పరిస్కారం లభిస్తుందన్నారు. ఈ క్యాంప్ ఏర్పాటు లో సహకరించిన వ్యాపార సముదాయ సిబ్బందికి డా కేర్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వారితో పాటు క్యాంపు లో ఖమ్మం బ్రాంచ్ పిఆర్ఓ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఫార్మాసిస్ట్ ఆషా కుమారి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments