Breaking News

Loading..

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన న్యూ డెమోక్రసీ బృందం.

 

                   బిసియం10 న్యూస్ దుమ్ముగూడెం 

                                  ది:28/5/2025

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గడ్డూరిగట్టు గ్రామం చిన్నబండిరేవు గ్రామపంచాయతీలో ఉంటున్న 25 కుటుంబాలకు 49 ఎకరాల భూములను సర్వే చేసి సర్వే నెంబర్లు ఇచ్చి ఆర్ ఓ ఎఫ్ ఆర్ రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వలేదని పట్టాలు లేకపోవడంతో లోన్లు కూడా ఇవ్వడం లేదని అట్టి భూములపై ఫారెస్ట్ మరియు అధికారులు ఒకటైపోయి అమాయక ఆదివాసి గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు గడ్డురుగట్టు  గ్రామ ప్రజలు ఈ జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రి సీతక్కకు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సమస్యపై మాట్లాడుతానని హామీ ఇచ్చిన సీతక్క ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ తాతల ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని సర్వే చేస్తామని చెప్పి సర్వే చేసి ఆర్ఓఎఫ్ ఆర్ పట్టాలు ఇస్తామని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు పట్టాలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి ఆదివాసి గిరిజనులైన మమ్ములను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు అన్నారు. అలాగే రాత్రికి రాత్రి ఫారెస్ట్ అధికారులు టేకు చెట్లను నరికి అమాయక ఆదివాసులైన మా పై అక్రమ కేసులు పెడుతున్నారని వారన్నారు. గతంలో ఇదే విషయంపై ఐటీడీఏ  పిఓ రాహుల్ ని కూడా కలిసామని వారు కూడా స్పందించి వారి భూములు వాళ్లకి ఇవ్వాలని రాసినప్పటికీ అధికారులు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తున్నారని వారన్నారు. ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ ప్రకారం మా భూమిలో మాకు హక్కు ఉంటుందని ఆ హక్కును కూడా ఉల్లంఘన చేసి ఫారెస్టు ప్రభుత్వ అధికారులు అక్రమ కేసులు పెడుతున్నారని మేము పెట్టాల్సిన కేసులు వారే మాపై దొంగతనంగా పెడుతున్నారని ఇది మంచిది కాదని వారన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ నానాయకుల ట్ట నరసింహారావు దుర్గమ్మ దుర్గమ్మ లక్ష్మీ రాంబాయి తదితరులు పాల్గొన్నారు.


..www.bcm10news.in 


Post a Comment

0 Comments