Breaking News

Loading..

ఏఐటీయూసీ ఆధ్వర్యంలోకాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఏర్పాటు..

  •  ఏఐటీయూసీ ఆధ్వర్యంలోకాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
  • నూతన కార్యవర్గపు సభ్యులతో గేటు మీటింగ్ ఏర్పాటు.
  • అర్హులైన ప్రతి ఒక్కరికి స్కిల్ మాట్రిక్స్ అమలుపరచాలి*.
  • కాంట్రాక్టు కార్మికులకు సంవత్సరం లొ రెండు జతలు సేఫ్టీ షూ అందుబాటులో ఉంచాలి.
  • ఐటీసీ కి సంబంధించిన స్థలంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలి.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండల ప్రాంతం సారపాకలో గల ఐటిసి పి ఎస్ పి డి పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. పరిశ్రమకు సంబంధించిన పిఎం#6 గేటు వద్ద ఉదయం 8 గంటల సమయంలో గౌరవ అధ్యక్షుడు సింగమనేని ప్రసాద్, గౌరవ సలహాదారు తన్నేరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏఐటీయూసీ కాంట్రాక్టు కార్మికుల అధ్యక్షుడు బల్లెం నాగయ్య , ప్రధాన కార్యదర్శి షేక్ జాహూర్ మరియు సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్ లు నిర్వహించారు.ఏఐటీయూసీ యూనియన్ గౌరవ అధ్యక్షులు సింగమనేని ప్రసాద్ మాట్లాడుతూ ఐటిసి పరిశ్రమలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు యాజమాన్యం వారిశ్రమకు తగిన ఫలితం ఇవ్వడం లేదని వారి శ్రమ దోపిడీ జరుగుతుందని ఆయన అన్నారు.

 ప్రస్తుతం బయట సమాజంలో పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తూ కొంత మంది స్వార్ధపు రాజకీయ నాయకుల అండతో కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం జరుగుతుంది ఆయన అన్నారు.భవిష్యత్తులో కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉండి వారి న్యాయమైన కోరికల కొరకు దశల వారి ఉద్యమం చేపడతామన్నారు. కాంట్రాక్టు కార్మికులు అందరూ కలిసికట్టుగా ఉండి వారి కష్టాన్ని గుర్తించి వారి శ్రమకు తగిన ఫలితం అందే విధంగా ప్రతి ఒక్క కార్మికుడు ముందుకు రావాలని వారి గళాన్ని వినిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడిన కాంట్రాక్టు కార్మికుల నాయకులు అధ్యక్షుడు బల్లెం నాగయ్య, ప్రధాన కార్యదర్శి షేక్ జహూర్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్, జాయింట్ సెక్రటరీ అనిల్ శర్మ, గౌతమ్, ఉపేంద్ర మరియు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చిన కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments