● సైన్స్ ఎక్స్పో, ఫుడ్ ఫెస్టివల్ లతో అలరించిన విద్యార్థులు.
ఖమ్మం, మార్చి 08, బిసిఎం10 న్యూస్.
మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం, కరుణగిరి టిఎన్జివోస్ కాలనీలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్ లో నిర్వహించిన సైన్స్ ఎక్స్పో, ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ యాదవ్, ప్రిన్సిపాల్ శ్రీలక్మి, విద్యార్థిని విద్యార్థుల తల్లులు హాజరై పిల్లలు తయారు చేసిన సైన్స్ పరికరాలను, ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాల ఇంటి తయారీ వంటకాలను సందర్శించారు. అనంతరం స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ పిల్లల్ని సమాజానికి ఉపయోగకరంగా రూపొందించడంలో తల్లుల అమూల్యమైన పాత్ర పట్ల ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో తమ సొంత పిల్లలు వారి తల్లులను సత్కరించి, పాదాలు కడిగి ఆశీర్వచనాలు తీసుకోవడం భావోద్వేగభరితంగా సాగింది. తమ పిల్లలతో తల్లులు సరదా ఆటలు ఆడి బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని సమస్యలను కనుగొని వాటికి పరిష్కార మార్గాలు చూపడానికి ఇలాంటి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, అలాగే విద్యార్థులు తమలోని సృజనాత్మకత, శాస్త్రీయ నైపుణ్యాల్ని పెంపొందించుకోగలుగుతారని వారన్నారు. పాఠాలలోని అనువర్తనాలను సులువుగా అర్థం అయ్యేలా తమ ప్రయోగాలతో చూపంచడం ఎంతో గొప్ప విష్యం అని వారు కొనియాడారు. అనంతరం స్కూల్ ఉపాధ్యాయుల సరదా ఆటపాటలు, సన్మాన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ షెహన, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తదితరులు ఉత్సాహంగా
పాల్గొన్నారు.


0 Comments