- పోడు భూమి సర్వే చేశారు- పట్టాలు ఇవ్వడం మరిచారు
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి
- వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టాలు ఇవ్వాలని ఏపీఓ డేవిడ్ రాజ్ కు వినతి.
పోడు భూములు సర్వే చేసి పట్టాలు ఇవ్వడం మరిచారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి అన్నారు. దుమ్ముగూడెం మండలం పెదనల్లపల్లి గౌరారం సంగం గ్రామాలకు చెందిన గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకి సర్వే చేసి నేటికీ పట్టాలు ఇవ్వలేదని తక్షణమే పట్టాలు ఇవ్వాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్ కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా గడ్డం స్వామి మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పోడు పట్టాలు ఇస్తామని హడావిడిగా సర్వే చేసి పట్టాలు ఇవ్వడం మరిచారని నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పట్టాలు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని విమర్శించారు. గత 30 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల భూములకు అధికారులు సర్వే చేశారని సంబంధించిన పత్రాలు అందించారని కానీ నేటికీ పట్టాలు మాత్రం ఇవ్వలేదని తక్షణమే అధికారులు సర్వే చేసిన పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతు బంధు మంజూరు చేయాలని పంట రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మర్మం చంద్రయ్య, రామ్మూర్తి సీతమ్మ, ఆదెమ్మ, లక్ష్మి నర్సు తదితరులు పాల్గొన్నారు.

0 Comments