Breaking News

Loading..

ఈవో రమాదేవిని మర్యాదపూర్వకంగాకలిసిన ఆల్ పెన్షనర్స్

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు ఈవో శ్రీమతి రమాదేవి ని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డివిజన్ కమిటీ బాధ్యులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఆల్ పెన్షనర్స్ 20 25 సంవత్సర డైరీ మరియు క్యాలెండర్ ను వారికి అందజేసి అనంతరం శ్రీమతి రమాదేవి గారికి పుష్పగుచ్చమిచ్చి సాలువలతో సన్మానించారు.

అనంతరం ఈవో రమాదేవి పెన్షనర్లను  ఉద్దేశించి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ అయిన మీకు స్పెషల్ దర్శనం తప్పనిసరిగా చేయిస్తామని తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు మరియు పెన్షనర్లు ఈవో రమాదేవి స్వామివారికి ఆమె  చేసే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేఎస్ ఎల్వీ ప్రసాద్. కోశాధికారి డి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు ఎస్ రాజబాబు, డివిజన్ సంఘ అడ్వైజర్ మరియు నాయకులుమాదిరెడ్డి రామ్మోహనరావు, ఉపాధ్యక్షులు జి మురళి కృష్ణ జిల్లా కౌన్సిలర్ అక్కయ్య, కార్యవర్గ సభ్యులు ఐలయ్య, విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం. వీరభద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 



Post a Comment

0 Comments