Breaking News

Loading..

పెన్షనర్స్ అసోసియేషన్ 20 25 డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు.

 

ఆదివారం ది 29.12.2024న ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ 20 25 నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంనందు భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకటరావు చేతులు మీదుగా ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం డాక్టర్ తెల్లం వెంకటరావు మాట్లాడుతూ పెన్షనర్ల యొక్క జీవోలు తదితర అన్ని విషయాలు కూలంకషంగా ఈ డైరీ యందు పొందుపరిచి ఉన్నాయని కావున ఈ డైరీ ని ప్రతి ఒక్క పెన్షనరు తీసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని డైరీలో అనేక విషయాలు పొందుపరచడం వల్ల ప్రతి పెన్షనర్ కు కరదీపికగా ఉపయోగపడుతుందని కావున తప్పనిసరిగా ప్రతి పెన్షనరు చేతిలో ఉంచుకొనుట ఎంతైనా అవసరం అన్నారు అలాగే మీ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా మీ వెన్నంటి ఉంటానని తెల్ల వెంకటరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్, కోశాధికారి డి కృష్ణమూర్తి, సహాయ కోశాధికారి నాళం సత్యనారాయణ ,డివిజన్ నాయకులు సుబ్బయ్య చౌదరి, ఎస్ రాజబాబు, మాదిరెడ్డి రామ్మోహనరావు, ఐలయ్య, ఐ వి సత్యనారాయణ, బి రాజు, అక్కయ్య, మరియు కాంగ్రెస్ నాయకులు తిరుపతిరావు, వెంకటరెడ్డి, నవాబు, తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments