Breaking News

Loading..

తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ లో అడ్వకేట్ గా ప్రమాణస్వీకారం.


● సమస్యలను సవాళ్ళుగా స్వీకరిస్తూ హైకోర్టు న్యాయవాది వరకు.

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 10, బిసిఎం10 న్యూస్.

చిన్ననాటి నుండి విద్యార్థిగా, ఆ తరువాత జీవితంలో అనేక కష్టాలు, అడ్డంకులను ఎదుర్కొని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా ప్రమాణస్వీకారం చేసిన గూడ రామ్ ప్రవీణ్ రెడ్డి పాఠాశాల దశలో తీసుకున్న సంకల్పం ఇప్పుడు నెరవేర్చుకున్నారు. సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం, చీకోడ్ గ్రామం గూడ విమల-దుర్గారెడ్డి కుమారుడు. కీ.శే.దుర్గారెడ్డి బిజేపి నాయకులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ సూపరిచితుడు. ప్రయత్నం ఉంటే ఎన్ని అవరోధాలనైన అధిగమించవచ్చు అనే విషయాన్ని అందరికి రామ్ ప్రవీణ్ తన జీవిత ప్రయాణంతో స్పష్టంగా తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ పట్టభద్రునైన నేను న్యాయశాస్త్రంలో రాణించడం, తెలంగాణా బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చెయ్యడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ విజయం సాధించడంలో నా కుటుంబ పాత్ర ఎంతో ప్రత్యేకమైందన్నారు. గ్రామీణ నేపథ్యం నుండి హైకోర్టు వరకు రావడం చాలా సవాళ్ళతో కూడుకున్న విష్యం, కానీ సంకల్పం దానికి తగ్గ క్రమశిక్షణ ఉంటే ఎవరికైనా సాధ్యమే. న్యాయాన్ని గెలిపించడం కోసం తనవంతు పాత్రను నిక్కచ్చిగా పోసిస్తానని ఈ సందర్భంగా ఆయనన్నారు.

Post a Comment

0 Comments