Breaking News

Loading..

ఆయన జీవితం 'పారిశ్రామిక చరిత్ర'లో ఓ శకం..!!

ఆయన జీవితం 'పారిశ్రామిక చరిత్ర'లో ఓ శకం..!!


◆ ఆయన మృతి ప్రపంచానికే తీరని లోటు - తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

ఖమ్మం, అక్టోబర్10, బిసిఎం10 న్యూస్.

భారత పారిశ్రామిక చరిత్రలో రతన్ టాటా ఓ శకం అని, ఆయన మృతి ప్రపంచానికే తీరని లోటని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికి, యావత్ దేశాని కె కాక ప్రపంచానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి, దాతృత్వానికి ప్రతీక అని తెలిపారు. పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా వారు ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

Post a Comment

0 Comments