![]() |
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జోనల్ స్థాయి 68 వSGF పాఠశాల క్రీడా పోటీలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులు చే గౌరవ వందన స్వీకరించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి హాకీ ప్లేయర్ ధైన్ చంద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం క్రీడా పోటీల జెండాను ఆవిష్కరించి క్రీడా పోటీలు ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అన్నారు.సామర్థ్యాలను మెరుగుపరచుకుంటూ విజయ బావుటాను ఎగురవేయాలని అన్నారు. క్రీడల్లో కోకో,కబడ్డీ, వాలీబాల్,పోటీలలో పాల్గనేందుకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని క్రీడలు ఆడడం వలన శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని మానసిక ఒత్తిళ్లు తట్టుకుని బాగా చదువుకునే శక్తి లభిస్తుందని ఆటలతోపాటు విద్య లో కూడా పోటీ తత్వంతో చదువుకోవాలని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటుచేసి మెరుగైన విద్యను అందిస్తుందని తెలియజేశారు విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉద్యోగాలు పొంది కుటుంబాలకు ఆసరాగా ఉండి మన దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా తోడు ఉంటుందని తెలియచేసారు అనంతరం ఉపాధ్యాయులు పాఠశాల లో పలు సమస్యలు పై ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందించారు. తక్సణమే అన్ని నిరవేరుస్తా అని హామీ ఇచ్చిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు.ఈ కార్యక్రమానికి, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, మరియు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments