బిసిఎం10 న్యూస్ ఆగస్టు 30 భద్రాచలం : సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకురాలు కెచ్చేల కల్పనా మాట్లాడుతూ గతంలో రాష్ట్ర విభజన జరగక ముందు మనుబోతుల చెరువు ప్రభుత్వ భూమిలో నిరుపేదలైన ఆదివాసి ప్రజలు 28 మంది ఇల్లు నిర్మించుకొని నివాసం ఉన్నారు
ఆ సందర్భంలో ఆ ఆదివాసులపై కేసులు కూడా అయ్యాయి అనంతరం వారికి ఆ ప్రాంతం పేరు మీద ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంటి పన్ను కరెంటు మీటరు అన్ని మంజూరు అయ్యాయ్యి కాలక్రమమైన రాష్ట్రాల విభజన అనంతరం ఈ ఆదివాసీలు ఉంటున్న ప్రాంతంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాలంటూ నాడున్న కలెక్టర్ ITDA PO లు ఈ ఆదివాసీలను అక్కడ నుంచి వెళ్లిపోవాలని అన్నారు ఆ ఆదివాసీలు భూమికి బదులు భూమి వెయ్యాలని అడిగినప్పుడు భూమికి బదులుగా భూమి ఇవ్వడం సాధ్యం కాదని ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించినప్పుడు మొదటి ప్రాధాన్యత మీకే ఇచ్చి డబల్ బెడ్ రూములు ముందు మీకు ఇచ్చిన తర్వాతనే ఇతర లబ్ధిదారులకు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఆ అధికారులు ఇచ్చిన హామీ మేరకు ఈ ఆదివాసీలు నేటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నాటినుండి ఈ ఆదివాసి బిడ్డలు ఉండటానికి ఇల్లు లేనందువల్ల అద్దె ఇంట్లో రెంట్లు కట్టుకుంటా నానా అవస్థలు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారు ఒకపక్క ఆ ప్రాంతంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించినప్పటికీ ఆ నిర్మించినటువంటి ఇళ్లను అర్హులైనటువంటి పేదలను గుర్తించి అధికారులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అవుతున్నారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ లోనూ పేద ప్రజలకు అందించడంలో విఫలం అయింది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా brs తోవలో పోవడం అనేది సరైన పద్ధతి కాదు అని అన్నారు మనుబోతుల చెరువు ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు కేటాయించి లక్షల వ్యయంతో ఇల్లు నిర్మించి అర్హులైన పేదలకు పంచకుండా నిరుపయోగంగా ఉంచడం సరైనది కాదు తక్షణమే ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి నిర్మాణం పూర్తయిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలి అవి ఇచ్చే ముందు మొదటి ప్రాధాన్యత నాడు కలెక్టర్ ఐటిడిఏ పిఓ ఈ ఆదివాసులకు ఇచ్చిన హామీ మేరకు మొదటి ప్రాధాన్యత 24 మంది ఆదివాసులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా నిర్మాణాన్ని పూర్తికాని డబల్ బెడ్ రూమ్ లను తక్షణమే పునర్ ప్రారంభించి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాజీవ్ నగర్ మనుబోతుల చెరువు ప్రభుత్వ భూమిలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఆకతాయిలకు అసాంఘిక కార్యకలాపాలకు పశువులకు పిచ్చి మొక్కలకు అడ్డాగా మారింది అని అన్నారు తక్షణమే రెవెన్యూ వారు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పర్యవేక్షించాలని పరిశీలించాలని పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలని అన్నారు అలాగే అధికారులు పట్టించుకోవడం వల్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆక్రమణకు గురైన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను తక్షణమే రెవెన్యూ వారు స్వాధీన పరుచుకోవాలని ఆక్రమణదారులను పై కేసులు పెట్టాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వీలైనంత త్వరగా లబ్ధిదారులను గుర్తించి డబల్ బెడ్ రూమ్ ని పేద ప్రజలకు పంచాలని అన్నారు లేని ఎడల కచ్చితంగా ఈ సమస్యపై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఉద్యమం నిర్వహిస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు కొండా చరణ్, దాసరి సాయన్న, మునిగల శివప్రశాంత్ , కచలపు ఈశ్వరమ్మ, నుపా రాధ, జెజ్జర నాగమనీ,కుంజా ముతమ్మ ,కారం రామమ్మ తదితరులు పాల్గొన్నారు.

0 Comments