బిసిఎం10 న్యూస్ మే 04 భద్రాచలం : ప్రభుత్వ ఆదేశముల మేరకు డివిజన్ పరిధిలోని మండలాల ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగినదని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట అన్నారు. సోమవారం నాడు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు వివిధ సమస్యల కొరకు ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకున్నారని, ఇందులో ముఖ్యంగా రెవిన్యూ సమస్యలు, పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాలతో పాటు పలు సమస్యలపై ప్రజలు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత డివిజన్ అధికారులకు పంపుతూ, ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాకాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేసి, నిర్ణీత గడువులో పరిష్కారం జరిగేలా చర్యలు చేపట్టాలని, పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, డీఏవో రాజేంద్రనాథ్, భద్రాచలం డివిజన్ పరిధిలోని వివిధ శాఖల డివిజనల్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments