- ఉపాధి హామీ నిధులలో కేంద్రం వాటా 90 శాతం నుండి 60 శాతానికి కుదించిన కేంద్రం*
- దీంతో జాతీయ గ్రామీణ ఉపాధికి, గ్రామీణ అభివృద్ధికి తీవ్ర విఘాతం*
- వాటికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తాం
- సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు.
బి సి ఎం టెన్ న్యూస్ డిసెంబర్ 28 ఎటపాక
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ఎటపాక: పేరు మార్చడమే కాదు దాని స్వభావాన్ని దెబ్బతీస్తూ గ్రామీణ ఉపాధికి , గ్రామీణ అభివృద్ధికి కేంద్రం తూట్లు పొడుస్తుందని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు అన్నారు. శనివారం తుమ్మల నగర్ లో సోందే రామారావు అధ్యక్షతన సిపిఎం మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మర్లపాటి నాగేశ్వరావు మాట్లాడుతూ వామపక్షాల కృషితో 2005లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ పేదల ఉపాధి కోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని, నేడు అది చట్టంగా అమలవుతుందన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% భరిస్తూ గ్రామాల్లో వందరోజులపాటు కచ్చితంగా ఉపాధిని కల్పిస్తుందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిననాటి నుండి ఉపాధి హామీ పథకంపై విషం కక్కుతోందని, కానీ నేడు ఉపాధి హామీ పథకం ఉసురు తీసారన్నారు. అలాగే ఈ పథకానికి కేంద్రం నిధులు కోత పెట్టి రాష్ట్రాలపై భారం వేస్తుందన్నారు. దీంతో ఈ పథకానికి నిధుల కొరత ఏర్పడుతుందన్నారు. పర్యావసానంగా గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాదిమందికి ఉపాధి తగ్గి, గ్రామపంచాయతీల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. దీనికి ఉపాధి హామీ కార్మికులంతా ఏకమై నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిస్తామని , మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తిరిగి యధావిధిగా కొనసాగే వరకు మా పోరాటం ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాక అర్జున్ దొర, మండల కమిటీ సభ్యులు పులుసు బాలకృష్ణ, పూనెం వెంకట్రావు, సవలం రాము, గద్దల హుస్సేన్, జంగిలి సంపత్ పాల్గొన్నారు.

0 Comments